స్వతంత్ర, వెబ్ డెస్క్: ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ప్రభుత్వ తీరుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తీరు వల్ల ఢిల్లీ సీఎంగా నేను కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని అన్నారు. ఒకవేళ తీసుకున్న శాఖల కార్యదర్శులను సైతం బదిలీ చేసే పరిస్థితి లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ప్రధాని ఆర్డినెన్స్ తెచ్చి మళ్లీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ ఆర్డినెన్స్ ఢిల్లీ ప్రజలకు అవమానకరమని వ్యాఖ్యానించారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బందిపెడుతోందని.. అయితే సీఎం కేసీఆర్ మద్దతుతో మాకు అండ పెరిగిందని వ్యాఖ్యానించారు.