స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా పార్టీని పటిష్టం చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తోంది బీఆర్ఎస్. అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయాలతో పార్టీ ముందుకు కదులుతోంది. తెలంగాణ తరహా ఇతర రాష్ట్రాల్లో తమ ప్రాబల్యాన్ని చూపించుకునేందుకు తమకంటూ ఒక కార్యాలయం ఉండాలని భావించి.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం ఆఫీస్ లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంగళగిరి రోడ్డులోని ఏఎస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఐదంతస్థుల భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యకలాపాలు నిర్వహించేందుకు కాన్ఫరెన్స్ హాళ్లు, నాయకులకు ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేశారు.