స్వతంత్ర వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం చాలా గొప్ప విషయం అని, అందుకు చాలా ఆనందంగా ఉందన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని. గుంటూరులో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చేతుల మీదగా 5 మెడికల్ కాలేజ్ లు ఆగస్టులో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఏపీలో ఎవరు ఊహించని విధంగా మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం.. జగనన్న ప్రభుత్వం విజయంగా తాము భావిస్తున్నట్లు తెలిపారు. 8, 500 కోట్లు రూపాయిలు ఇప్పటికే మంజూరు అయ్యాయని.. 5 కాలేజీల్లో 150 MBBS సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్.. నాటి నుంచి నేటి వరకు అనేక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి అందిస్తున్నారని కొనియాడారు. కష్టకాలంలో పూర్తి స్థాయిలో వైద్యన్ని అందుబాటులో ఉంచామని.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి వైద్య సేవలు తీసుకు వెళ్లడం జరుగుతుందన్నారు. గతంలో కన్నా నేడు రాష్ట్ర ప్రభుత్వం అనేక పీజీ సీట్లు పెంచిందని.. గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో సెల్ లైట్లు వేసి వైద్యం చేసే పరిస్థితి నుంచి నేడు గ్రామ గ్రామన కూడా నాణ్యమైన వైద్యాన్నిఅందించేంతగా ఎదిగామని అన్నారు. గతంలో ఆరోగ్య శ్రీ విషయంలో చంద్రబాబు తీరు దోచుకో దాచుకో అనే విధంగా ఉండేదని.. నేడు రాష్ట్రములో అ పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.


