ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు సచివాలయ సిబ్బంది. రెండు నెలలుగా పెన్షన్ తీసుకోని వారికి సైతం.. రెండు నెలల పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నారు.
ఇందులో భాగంగానే.. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బొమ్మనహాళ్ మండలం నెమకల్లు గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం గ్రామసభలో పాల్గొని సమస్యలు స్వయంగా తెలుసుకుంటారు. టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత ప్రతినెలా పెన్షన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. గ్రామసభ ద్వారా ప్రజల సమస్యలను వింటున్నారు.