37.2 C
Hyderabad
Sunday, April 12, 2026
spot_img

మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

   తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏంటీ వెతలని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది? అని ప్రభుత్వంపై నిప్పులుచెరి గారు.ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు.! నేడు విత్తనాలు కొందా మంటే అమ్మేటోడు లేడని ఎద్దేవా చేశారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిద ర్శనం ఇంకేం కావాలి? అని అన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారని మండిప డ్డారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా? అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంట లకు లైన్ లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా? అని నిలదీశారు కేటీ ఆర్. గత పదేళ్లపాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలు ఇప్పుడు 10 గంటలపాటు పడిగాపులు పడినా అందించలేరా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్