పాపం కోడెగిత్తలు కథనం అధికారుల్లో చలనం తెప్పించింది. స్వతంత్ర ఛానెల్ ప్రసారం చేసిన ఈ కార్యక్రమంతో కదిలిన ఆఫీసర్లు రాజన్న కోడెల బాగోగులపై ఫోకస్ పెట్టారు. అంతేకాదు మెరుగైన సౌకర్యా ల ఏర్పాట్లలో మునిగి పోయారు.
దక్షిణ కాశీగా పిలువబడే ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అంటేనే కోడె మొక్కులకు ప్రసిద్ధి. కోడెను కడితే చాలు కోరిన కోరికలు తీర్చే రాజన్న కోడెలకు రక్షణ కరువు అవడం, అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మూగ జీవాలు అల్లాడిపోయాయి. దీంతో గోశాలలో కోడెల కష్టాలపై పాపం కోడెగిత్తలు అనే ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది స్వతంత్ర ఛానల్. అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించింది.
ఈ కథనంపై స్పందించిన అధికారులు గోశాల వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లలో మునిగారు. ఈ క్రమంలోనే బురదలో అల్లాడిపోయిన గోవుల సంరక్షణ కోసం గోశాల వద్ద మట్టి, మొరం పోయించారు. అంతేకాదు తిప్పాపూర్ గోశాలలో పశుసంవర్ధక శాఖ అధికారులు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 1500 కోడెలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోడెలకు సెలైన్లు, బి-కాంప్లెక్స్ ఇంజక్షన్లు వేశారు. ఈ సందర్భంగా 15 మంది వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కలిసి గోశాలలోని కోడెలను అన్నింటినీ పరిశీలించి, వివిధ రుగ్మతలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోడెలకు వైద్యం చేసినట్లు తెలిపారు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కొమురయ్య. గోశాల విస్తీర్ణం తక్కువగా ఉండటం, కోడెల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కోడెలు ఇబ్బంది పడుతు న్నాయన్నారు. దీనిపై ఇప్పటి కే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని సిఎంవో నుండి అనుమతి వచ్చిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వేసి, కోడెల ఇబ్బందులను తీర్చేందుకు చర్యలు ప్రారంభించ నున్నట్టు వెల్లడించారు.
రాజన్న ఆలయానికి రెండు గోశాలలు ఉండగా ఒకటి కట్ట కింద, రెండోది తిప్పాపురంలో ఉంది. వానాకా లంలో కోడెల సంరక్షణలో చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటీవల కురుస్తున్న వానలకు గోశాల మొత్తం బురదమయంగా మారింది. వారం రోజులుగా దాదాపు 1000 కోడెలు ఆ బురద నీటిలోనే అవస్థలు పడ్డాయి. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. మరోవైపు మేత వేయాలన్నా కష్టం గా మారింది. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెడుతున్న కోడెల సంరక్షణపై దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా పాపం కోడెగిత్తలు కార్యక్ర మానికి వచ్చిన స్పందనతో అధికారులు కోడెల సంరక్షణ చర్యలకు పూనుకున్నారు. దీంతో స్వతంత్ర ఛానెల్ ప్రసారం చేసిన కథనాన్న ప్రశంసిస్తున్నారు గో రక్షకులు, జంతు ప్రేమికులు. అలాగే ఎప్పటి కప్పుడు సంర క్షణ చర్యలు ఉంటేనే కోడెలు ఆరోగ్యంగా ఉంటాయని ఇకనైనా అధికారుల ఇదే పని తీరు ను కొనసాగిం చాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నం దును ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అంటున్నారు.