NZ vs SL T20 | న్యూజిలాండ్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మ్యాచు జరుగుతుండగా మైదానానికి అతి దగ్గరలో విమానాలు టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే విమానాలను పట్టించుకోకుండా ఆటగాళ్లు, ప్రేక్షకులు ఆటను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత దగ్గరగా విమానాలు తిరిగితే జనాలకు ప్రమాదం కదా? అని కామెంట్స్ చేస్తున్నారు.
NZ vs SL T20 |అయితే అసలు విషయం ఏంటంటే ఈ మ్యాచ్ జరిగిన క్వీన్స్ టౌన్ లోని జాన్ డేవిస్ గ్రౌండ్ పక్కనే ఎయిర్ పోర్టు రన్ వే ఉంది. దీంతో నిత్యం గ్రౌండ్ మీదుగా ఇక్కడ విమానాలు టేకాఫ్ అవుతుంటాయి. కాగా ఈ మ్యాచులో న్యూజిలాండ్ జట్టు శ్రీలంకపై గెలిచి మూడు టీ20ల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది.
Read Also: ఎన్నికల వేళ కర్ణాటకలో బోనీకపూర్ కారులో వెండి వస్తువులు లభ్యం
Follow us on: Youtube, Instagram, Google News