17.7 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

CM Jagan : గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. కూనలంకలో(Kunalanka) పర్యటిస్తున్న సీఎం.. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా గమనించాలని చెబుతున్నారు. అలాగే కష్ట సమయంలో సరైన సదుపాయాలు అందాయా లేదా అని.. పిలిచిన వెంటనే అధికారులు వచ్చారా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో అధికారంలో ఉన్న అధికారులు.. పేపర్లలో ఫొటోలు వచ్చేలా చేసుకునే వారని, సమస్య రాగానే వచ్చి హడావుడి చేసేవారని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం సాయం అందేలా చేస్తే చాలనుకుని ముందుకు వెళ్లినట్లు సీఎం జగన్ వెల్లడించారు.

వారం రోజులు పాటు జిల్లా కలెక్టర్లంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేశామని.. బాధితులందరికీ సాయం అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. తానే స్వయంగా వచ్చి వరద బాధితులను (flood victims) కలుస్తానని చెప్పానని… మాట ప్రకారం ఇప్పుడు జిల్లాలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వరద బాధితులకు నిత్యావసరాలు అందించామన్నారు. ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ. 10 వేలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. అందరికీ రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశామని.. వరద సాయం అందుకుంటే ఇక్కడకు వచ్చి తనకు చెప్పండని అన్నారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే తమ తాపత్రయం అని.. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదన్నారు.

Latest Articles

రేవంత్‌రెడ్డి ఓ భూ కబ్జాదారు – హరీష్‌రావు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మాజీ మంత్రి హరీష్‌రావు. రేవంత్‌ ఓ భూ కబ్జాదారుడని ఆరోపించారు. సంగారెడ్డిలో పర్యటించిన హరీష్‌రావు... ప్రశ్నించే గొంతులపై బ్లాక్‌మెయిల్‌ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తనపైనా అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్