స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. తనకు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు ఎవరూ లేరని.. ముఖ్యమంత్రి ఎవరన్న నిర్ణయంపై పార్టీ అధిష్ఠానానికే వదిలేశానని అన్నారు. అనారోగ్య కారణాల వల్ల తాను ఢిల్లీకి వెళ్లట్లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే మాజీ సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే.