సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామ పత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో నియోజకవర్గాల్లో సందడి మొదలైంది. దీంతో ఆయా పార్టీలకు చెందిన నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగిన చల్లా వంశీచందర్ రెడ్డి నేడు నామినేషన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారు. మెట్టుగడ్డ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కలెక్టరేట్లో నామినేషన్ల దాఖలు అనంతరం పట్టణంలోని క్లాక్ టవర్ కూడలిలో సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించ నున్నారు. సీఎం రాకా సందర్భంగా పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిటమైన భద్రత చర్యలు తీసుకున్నారు..


