స్వతంత్ర వెబ్ డెస్క్: డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ మేకర్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విజయ్, సమంత ల కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. లవ్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీని తీయడంలో శివ నిర్వాణ మార్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోసారి శివ నిర్వాణ తన మ్యాజిక్ చూపించేందుకు రెడీగా ఉన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అదేంటి అంటే.. ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైంది. ‘ఖుషి’లో ఆరాధ్య అంటూ సాగే రెండో గీతాన్ని ఈ వారమే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సాంగ్ ప్రోమోను జూలై 10న (సోమవారం), ఫుల్ లిరికల్ వీడియోను జూలై 12న (బుధవారం) విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే.. హీరో హీరోయిన్లు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని లవ్లీగా కనిపించారు.
ఈ సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఏపీలోని ద్రాక్షారామం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు. అక్కడ చిత్రీకరణ ముగించుకుని శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. సమంత కూడా రిటర్న్ అవుతున్నట్లు తెలిసింది. ఏపీలో జరిగిన ‘ఖుషి’ చిత్రీకరణలో మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా పాల్గొన్నారు. వాళ్ళిద్దరూ యాగం చేస్తుంటే.. వెనుక విజయ్ దేవరకొండ, సమంత నిలబడి ఉన్నారు. ఈ వీడియో విజయ్ దేవరకొండ స్వయంగా పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ది దేవరకొండ బ్రాడ్ కాస్ట్’ ఛానల్ క్రియేట్ చేసిన ఆయన.. అందులో ఈ వీడియో షేర్ చేశారు. ఇది ‘ఖుషి’ లాస్ట్ షెడ్యూల్ అని ఆయన పేర్కొన్నారు.
‘ఖుషి’ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. ‘నా రోజా నువ్వే’ పాటను కూడా ఆయనే పాడారు. పాన్ ఇండియా సినిమాగా ‘ఖుషి’ తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ‘ఖుషి’ సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.