27.2 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

కొత్త ప్రభాకర్‌ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల, ఇంకా 10 రోజులు హాస్పిటల్ లోనే..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేసారు వైద్యులు. 4 గంటల పాటు సర్జరీ చేసి సుమారు 15 ఇంచుల చిన్నపేగును తొలిగించటం ఇదంతా మొన్నటి వరకు జరిగింది. కాగా ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. ఆయన ఎప్పుడు కోలుకుంటారన్న అంశాలపై యశోదా డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మొన్న జరిగిన కత్తి దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపులోకి 3 ఇంచుల లోతుకు కత్తి దిగగా లోపల చిన్నపేగుకు నాలుగు చోట్ల గాయాలైనట్టు వైద్యులు వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు సర్జరీ చేయగా సుమారు 15 సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు వైద్యులు తెలిపారు. సర్జరీ తర్వాత ప్రభాకర్ రెడ్డిని పోస్ట్ ఆపరేటివ్ కోసం ICU కి షిఫ్ట్ చేశామని, బీపీ సాధారణంగా మెయింటైన్ అవుతుందన్నారు. ఇప్పుడే ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పడానికి లేదన్నారు. ICU లోనే ఇంకో 5 రోజులు చికిత్స అందించాలన్నారు. పదిహేను రోజులు తరువాత కుట్లు తీస్తామని, ఇది మేజర్ సర్జరీగానే చెప్పొచ్చని, రికవరీకి సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. బయట చిన్న గాటులాగే ఉంటుందని, కానీ లోపల పేగుల దగ్గర కత్తి పోటు కావటంతో సమయం పడుతుందని వైద్యులు వివరించారు.

Latest Articles

ఏపీ బ్రాండ్‌ను మాజీ సీఎం జగన్‌ దెబ్బతీశారు – చంద్రబాబు

మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. తల్లి, చెల్లిపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్