స్వతంత్ర, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇప్పటివరకు 43 మంది నిందితులు అరెస్ట్ చేసింది సిట్. తాజాగా వరంగల్ జిల్లాకి చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు తెరపైకి వచ్చింది. సదరు విద్యుత్ శాఖ డీఈ కనుసున్నల్లో పెద్ద ఎత్తున ఏఈ పేపర్ చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిషోర్ ను అరెస్ట్ చేసింది సిట్.


