Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

మ్యాచ్ గెలిచినా కూడా కెప్టెన్ పాండ్యాపై నెటిజన్ల ఫైర్.. ఎందుకంటే..?

స్వతంత్ర వెబ్ డెస్క్: భారత్ – వెస్టిండీస్ (India – West Indies) మధ్య  గయానా వేదికగా నిన్న రాత్రి ముగిసిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది.  విండీస్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు.. 17.5 ఓవర్లలోనే  దంచేసింది.   సూర్యకుమార్ యాదవ్ (83) తో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్)లు (Tilak Verma)  సూపర్ ఇన్నింగ్స్‌తో  భారత్‌కు విజయం దక్కింది. అయితే నిన్నటి మ్యాచ్‌లో అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న తిలక్ వర్మకు నిరాశకు గురి చేస్తూ హార్ధిక్ పాండ్యా  ఆఖర్లో సిక్సర్ కొట్టి అతడి ఆశలపై నీళ్లు చల్లాడు. హార్ధిక్ మ్యాచ్‌ను గెలిపించినా  నెటిజన్లు మాత్రం అతడిపై ఫైర్ అవుతున్నారు. మరొక్క పరుగు తీస్తే అతడి ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీల రికార్డు ఉండేది.   అప్పటికీ భారత విజయం ఖరారై, చేతిలో ఏడు వికెట్లు ఉన్న సమయంలో  క్రీజులో ఉన్న బ్యాటర్ ఎవరైనా తిలక్ వర్మ‌కు బ్యాటింగ్ ఇచ్చేవాడే. కానీ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya) రూటే సెపరేటు కదా.. ఏదో ముంచుకొచ్చినట్టు  ఐదో బాల్‌కు భారీ సిక్సర్ బాదాడు.

తాజాగా హార్ధిక్ చేసిన పనితో  నెటిజన్లు.. ‘ధోనీతో హార్ధిక్‌కు పోలికేంటి..? ఇది ధోనీ గొప్పతనం’ అని  ఈ వీడియోను  వైరల్ చేస్తున్నారు.  ధోనిది నిస్వార్థంగా ఉండే మనస్తత్వమైతే హార్ధిక్ మాత్రం స్వార్థపరుడని..  విజయం క్రెడిట్ తనకే దక్కాలనే ఆశతో ఫినిషర్ అనిపించుకోవాలనే ఆత్రుతతో ఇలా చేశాడని కారాలు మిరియాలు నూరుతున్నారు. హార్ధిక్ ఇలా చేశాక ట్విటర్‌లో #Selfish  ట్రెండింగ్‌లోకి వచ్చింది. సెల్ఫిష్ పాండ్యా (Selfish Pandya) అంటూ  నెటిజన్లు హార్ధిక్ పై దుమ్మెత్తిపోస్తున్నారు.   మ్యాచ్ గెలిచినందుకు సంతోషమే గానీ  ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ స్థాయిలో అడుగులు వేస్తున్న  ఆటగాడికి అండగా నిలవాల్సింది పోయి ఫినిషర్ అనిపించుకోవాలనే ఆత్రుతలో ఇలా చేయడమేంటని నిందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్