26.8 C
Hyderabad
Wednesday, July 16, 2025
spot_img

మలేషియాలో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక

తెలుగు చిత్ర సీమ 90 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు మలేషియా గర్వంగా సిద్దమైంది. ఇది 90 ఏళ్ల తెలుగు సినిమా వారసత్వానికి సంబంధించిన గొప్ప వేడుక కానుంది. మన తెలుగు సినిమా ప్రయాణం 1932లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్ విష్ణు మంచు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది.

కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టేడియంలో జూలై 20, 2024న ఈ వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో సినిమా రంగానికి చెందిన అతిరథలు ఎందరో హాజరు కానున్నారు. ఈ వేడుక యొక్క ప్రాముఖ్యతను వివరిస్తు మరియు ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా నిలుస్తున్న భాగస్వామ్యులను అందరినీ పరిచయం చేస్తూ సన్‌వే పిరమిడ్, సన్‌వే రిసార్ట్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించిన లాంచ్, ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగాయి.

మూడు దేశాల నుండి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ను మలేషియాలో నిర్వహించడం ఉత్తమమని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ సాంస్కృతిక సమావేశాలకు అగ్రశ్రేణి వేదికగా తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి మలేషియా నిబద్ధతను నొక్కి చెబుతుంది. మలేషియా టూరిజం , మా (MAA), స్థానిక ఈవెంట్ ఆర్గనైజర్ MC ఎంటర్‌టైన్‌మెంట్‌తో భాగస్వామ్యంతో, ఈ గ్లోబల్ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు.

ఈ ఈవెంట్‌ కోసం మలేషియా పర్యాటక శాఖ, విమానయాన సంస్థలు, హోటళ్లతో కలిసి ఆకర్షణీయమైన ధరలను అందిస్తోంది. అందరికీ ఆతిథ్యం, చిరస్మరణీయ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రయత్నాలు విజిట్ మలేషియా ఇయర్ 2026కి ముందు మలేషియాను ప్రధాన టూరిస్ట్ ప్లేస్‌గా, పర్యాటక గమ్యస్థానంగా ప్రచారం చేయడానికి విస్తృత వ్యూహంలో భాగంగా ఉన్నాయి.

నవతిహి ఉత్సవం 2024 కేవలం సినిమా విజయాల వేడుక మాత్రమే కాదు. మలేషియా ప్రజలు, తెలుగు మాట్లాడే వర్గాల మధ్య పరస్పర అవగాహన, గౌరవాన్ని పెంపొందించే సాంస్కృతిక మార్పిడికి చిహ్నంగా ఈ ఈవెంట్ జరగనుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్