సీపీఐకి జాతీయ హోదాను రద్దు చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం విచారకరం అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) అన్నారు. సాంకేతికపరమైన అంశాలనే ఈసీ(EC) పరిగణనలోకి తీసుకుందని అయన వ్యాఖ్యానించారు. వందేళ్ల చరిత్ర గల సీపీఐ స్వాతంత్రోద్యమంలో పాల్గొందని గుర్తుచేశారు. అయితే ఈసీ తీసుకున్న ఈనిర్ణయం సీపీఐని ఏమాత్రం కూడా నిరుత్సాహపరచలేదని అన్నారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్(TMC), సీపీఐ(CPI), ఎన్సీపీ(NCP) పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: జాతీయ పార్టీ హోదా దక్కాలంటే ఉండాల్సిన అర్హతలేంటి?
Follow us on: Youtube, Instagram, Google News