ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam)లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind kejriwal) కు సీబీఐ సమన్లు జారీచేసింది. ఏప్రిల్ 16న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ స్కాంలో మనీ ల్యాండరింగ్ పై కేజ్రీవాల్ ను సీబీఐ ఆరోజున విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న మనీశ్ సిసోడియా రిమార్డ్ రిపోర్టులో సీబీఐ కేజ్రీవాల్ పేరును చేర్చింది. సాక్షాత్తూ సీఎం అయిన కేజ్రీవాల్ కు సమన్లు జారీచేయడం దేశ రాజకీయాల్లో సంచలనం సష్టిస్తోంది. దీనిపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చారని మండిపడుతున్నారు. కాగా ఈ కేసులో జైలులో ఉన్న నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో జరిపిన వాట్సాప్ చాట్ ను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ చాట్ లో అరవింద్ కేజ్రీవాల్(AK) ఆమెకు డబ్బులు ఇవ్వమన్నట్లు ఉంది.