Naresh and Pavitra Lokesh | గత కొన్నాళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన జంట నరేష్ – పవిత్రా లొకేష్. ఇప్పటికి ఈ జంట గురించి ఏదైనా గాసిప్ వచ్చిందంటే చాలు.. దానిని తెలుసుకునేందుకు సినీ అభిమానులు చాలా ఆసక్తి చూపుతుంటారు. సినిమాలోనే కాకుండా.. బయటకూడా వీరిద్దరూ కలిసి తిరగటంతో అభిమానుల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఆ మధ్య ఓ హోటల్ లో నరేష్ – పవిత్ర ఉండటం.. వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు నరేష్ మూడవ భార్య హోటల్ కి వెళ్లి హంగామా చేయడం.. చివరికి నరేష్ విజిల్స్ వేసుకుంటూ బయటకు రావడం.. ఇదంతా తెలిసిందే. అయితే మూడవ భార్యను వదిలేసిన నరేష్.. పవిత్రను పెళ్లిచేసుకుంటాడా లేదా అని అందరూ అనుకుంటుండగా.. ఓ వీడియో ను సోషల్ మీడియా లో రిలీజ్ చేశాడు. ఆ వీడియో చూసి నరేష్ – పవిత్రకు పెళ్లిఅయింది అని అందరూ అనుకున్నారు. ఇది వట్టి వీడియో మాత్రమే.. పెళ్లి కాలేదు అని తేలేసరికి.. అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇప్పుడు తాజాగా మరో వీడియో రిలీజ్ చేస్తూ.. మరో షాక్ కి గురిచేశాడు నరేష్.
తాజాగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు నరేష్. అయితే ఈ టీజర్ చూశాక నిజంగానే అందరూ షాక్ కు గురవుతున్నారు. ఇంతకీ ఇందులో ఏముందంటే… ఇన్ని రోజులు నరేష్ అనుభవించిన జీవితం, మూడవ భార్యతో గొడవలు, పవిత్రా లోకేష్ తన లైఫ్ లోకి రావడం లాంటివి చూపించారు. టీజర్ లో నరేష్ – పవిత్రతో కలిసి తిరగడం, నరేష్ మూడో భార్య మీడియా ముందుకి వచ్చి మాట్లాడటం, నరేష్ – పవిత్ర హోటల్ లో జరిగిన నానా రభసంతా చూపించారు. నరేష్ విజిల్ వేసుకుంటే బయటకి వెళ్లే సీన్ ని కూడా చూపించారు. దీంతో టీజర్ చూసిన ప్రతి ఒక్కరు నరేష్ నిజజీవితాన్నే సినిమాగా తెరకెక్కించాడు అని అనుకుంటున్నారు. ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. నరేష్ మూడో భార్య క్యారెక్టర్ లో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటించడం. ఈ సినిమాలో వనిత క్యారెక్టర్ కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నరేష్ నిర్మించగా… ప్రముఖ దర్శక, నిర్మాత MS రాజు తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నరేష్ నరేష్ మూడవ భార్య ఎలా స్పందిస్తుందోనని సినీ ప్రియులు అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.