స్వతంత్ర, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల్లో చరిత్ర సృష్టించిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల అభివృద్దే నరేంద్ర మోడీ , బీజేపీ లక్ష్యమని అన్నారు. రూ.12 వేలకోట్లతో నిర్మిస్తున్న నేషనల్ కోదాడ కొరివి నేషనల్ హైవే పనులు 60 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మరో 13 నెలల్లో పూర్తిస్థాయిలో నేషనల్ హైవే పనులు పూర్తి కానున్నాయని తెలిపారు.
కాంగ్రెస్, కెసిఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదన్న నిర్మల్.. దేశంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ వల్లనేనని వ్యాఖ్యానించారు. చైనాతో యుద్ధం కేనా, కరోనా సమయంలో దేశ ప్రజలను కాపాడింది మోడీ ప్రభుత్వమేనని కొనియాడారు. రైతులు పండించిన పంట అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వమని మోడీ సేవలను అభివర్ణించారు.