33.8 C
Hyderabad
Monday, April 28, 2025
spot_img

Narendra Modi: ‘మహాదేవ్‌’ పేరునూ వదిలిపెట్టలేదు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌( (Chhattisgarh)లో ఇటీవల పెద్దఎత్తున డబ్బు పట్టుబడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌(CM Bhupesh Baghel) ఎందుకు కలవరపడుతున్నారని ప్రధాని మోదీ(Narendra Modi) ప్రశ్నించారు.

అవినీతి సొమ్ముతో తన ఖజానాను నింపుకోవడానికే కాంగ్రెస్‌ (Congress) పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల (Chhattisgarh Polls) ప్రచారంలో భాగంగా దుర్గ్‌లో నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘మహాదేవ్ (Mahadev)’ పేరును కూడా వదిలిపెట్టలేదని విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తన దృష్టిలో దేశంలో అతిపెద్ద సామాజిక వర్గం అంటే ‘పేదరికమే’ అని, తాను వారి సేవకుడినని ప్రధాని మోదీ(Narendra Modi) పేర్కొన్నారు. పేదలను విభజించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కొత్త కుట్రలు పన్నుతున్నాయని, కులతత్వ విషాన్ని వ్యాపింపజేస్తున్నాయని ఆరోపించారు. ఓబీసీ ప్రధాన మంత్రిని, మొత్తం వర్గాన్నే కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) దూషిస్తోందని, అయితే.. వీటికి తాను భయపడనని అన్నారు. పేదల అభివృద్ధిని కాంగ్రెస్‌ కోరుకోవడం లేదని విమర్శించారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని(Free Ration Scheme) వచ్చే ఐదేళ్ల పాటు పొడిగిస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌(Mahadev Betting App) అంశం తీవ్ర కలకలం రేపుతోంది. దాని నిర్వాహకులు.. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌(CM Bhupesh Baghel)కు రూ.508 కోట్లు చెల్లించినట్లు ఈడీ ఆరోపించింది. ఇదే వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. దుబాయ్‌లో జరిగిన ఈ కుంభకోణం నిందితులతో తమకేంటి సంబంధం అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల రాష్ట్రంలో పెద్దఎత్తున డబ్బు పట్టుబడిన తర్వాత ముఖ్యమంత్రి ఎందుకు కలత చెందుతున్నారని ప్రశ్నించారు.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు రెండు దఫాల్లో జరగనున్నాయి. తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న, రెండో విడతలో మిగతా 70 స్థానాలకు నవంబర్‌ 17న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష భాజపా సహా ఆయా పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

మోదీ వ్యాఖ్యలకు భూపేష్ బఘేల్ కౌంటర్

ప్రధాని మోదీ చేసిన ఆ ఆరోపణలపై భూపేష్ బఘేల్ (Bhupesh Baghel)స్పందిస్తూ.. ‘‘నిజంగా అవినీతి జరిగి ఉంటే, ఆ యాప్‌ని ఎందుకు మూసివేయలేదు? ఆ యాప్‌ని శాశ్వతంగా మూసివేసే బాధ్యత భారత ప్రభుత్వానిదే. అసలు వాళ్లతో ప్రధాని మోదీకి ఉన్న ఒప్పందం ఏంటని నేను అడగాలనుకుంటున్నాను. ఒకవేళ ఎలాంటి డీల్ లేకపోతే.. భారత ప్రభుత్వం ఆ యాప్‌ని బ్యాన్ చేసే దిశగా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని కౌంటర్ ఎటాక్ చేశారు. అంతేకాదు.. బీజేపీ(BJP) వాళ్లు ప్రత్యక్ష పోరాటం చేయలేరని.. అందుకే ఈడీ(ED), ఐటీ(IT), మీడియా ద్వారా ఎన్నికల్లో పోరాడుతున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి విచారణ లేకుండానే మోదీ ఆరోపణలు చేస్తున్నారని.. ఈడీ, ఐటీ ఇక్కడ తిరుగుతున్నాయని.. ఇది మీ (మోదీ) విలువలేనితనాన్ని తెలియజేస్తుందని బఘేల్ ధ్వజమెత్తారు.

బెట్టింగ్ యాప్ వివాదం ఏంటి?

ఫోరెన్సిక్ విశ్లేషణ, క్యాష్ కొరియర్ చేసిన ప్రకటన ఆధారంగా.. మహాదేవ్ బెట్టింగ్ యాప్(Mahadev Betting App) ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్‌కు ఇప్పటివరకూ సుమారు రూ. 508 కోట్లు చెల్లించారనే ఆరోపణలకు దారితీసిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తెలిపింది. దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. శనివారం ఉదయం ఈడీ ఈ అంశాన్ని ప్రస్తావించడమే ఆలస్యం.. కాంగ్రెస్‌ని టార్గెట్‌ చేసుకొని మోదీ ఆరోపణలు గుప్పించడం, ఆ వెంటనే భూపేష్ ఆయనకు కౌంటర్ ఇవ్వడం జరిగింది.

Latest Articles

‘ముత్తయ్య’ ట్రైలర్ రిలీజ్ చేసిన రాజమౌళి

కె. సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ 'ముత్తయ్య'. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్