22.2 C
Hyderabad
Wednesday, March 18, 2026
spot_img

వైసీపీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజీనామా

     వైసీపీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన జగన్‌తో కలిసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు పార్టీలోనే ఉంటూ వైసీపీని విమర్శిస్తున్న రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణ ఎట్టకేలకు రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎంపీగా కొనసాగు తానన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘు రామకృష్ణ… కొద్ది కాలానికే పార్టీతో విభేదించారు. తాజాగా అధికార పార్టీకి రాజీనామా చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్