స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 100వ రోజు యువగళం పాదయాత్రను శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు. లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు నడిచారు.
మార్గంమధ్యలో తల్లి భువనేశ్వరి షూ లేస్ ఊడిపోవడంతో లోకేశ్ కట్టి కొడుకు ప్రేమను చాటుకున్నారు. పాదయాత్ర 100 రోజులు పూర్తైన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను ఆవిష్కరించారు. మరోవైపు తెలంగాణ టీడీపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్ తదితరులు లోకేశ్‌ను కలిసి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.