Yuvagalam | తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటివరకు లోకేష్(Nara Lokesh) 410 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. మార్చి 2వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గుమ్మడివారి ఇండ్లులో విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 8గంటల10 నిమిషాలకు పోలవరపు ఇండ్లు గ్రామంలో బీసీ నాయకులతో జరిగి సమావేశంలో పాల్గొంటారు. 10గంటల 20 నిమిషాలకు దామలచెరువు మ్యాంగోనగర్ లో గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. 10 గంటల 40 నిమిషాలకు దామలచెరువులో ముస్లిం సామాజిక వర్గీయులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటల15 నిమిషాలకు కొండేపల్లి క్రాస్ వద్ద భోజన విరామం తర్వాత.. మధ్యాహ్నం 2గంటల 20 నిమిషాలకు కొండేపల్లి క్రాస్ వద్ద రైతులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. 3 గంటలకు పాదయాత్రను పునఃప్రారంభిస్తారు. సాయంత్రం 4గంటలకు మొగరాల గ్రామస్తులతో సమావేశమై.. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు నారా లోకేష్. సాయంత్ర 5 గంటలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులోకి యువగళం పాదయాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం 6గంటల 15 నిమిషాలకు పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం కొమ్మురెడ్డి పల్లి విడిది కేంద్రంలో బస చేస్తారు.
Yuvagalam |400 రోజుల పాటు.. 4వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టిన నారా లోకేష్ ఇప్పటికి 31 రోజుల పాదయాత్రను పూర్తిచేసుకున్నారు. తన పాదయాత్రలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణులు సైతం ఎక్కడికక్కడ తమ నాయకుడికి ఘన స్వాగతం పలుకుతున్నారు.
Read Also: ఏపీలో డ్రగ్స్ మాఫియా.. నారా లోకేష్ కీలక అడుగు
Follow us on: Youtube