Nara Lokesh |యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తనదైన శైలిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల దగ్గర సెల్ఫీలు దిగుతూ సీఎం జగన్ కు సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నారు. తాజాగా ప్రభుత్వం చేపట్టిన ‘ఫిష్ ఆంధ్ర’ షాపులు దగ్గర సెల్ఫీలు దిగుతూ ప్రభుత్వాన్ని ర్యాగింగ్ చేస్తున్నారు. పుట్టపర్తి నియోజకవర్గం ఓబులదేవచెరువులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్.. అక్కడ మూతపడిన ‘ఫిష్ ఆంధ్ర’ షాపు ముందు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘చేపా, చేపా ఎందుకు ఎండలేదని అడిగితే గడ్డిమేటు అడ్డొచ్చింది అందట. అట్టా ఉంది మన జగన్ రెడ్డి చేపల బజార్ల తీరు. చేపల దుకాణం ఎందుకు తీయలేదంటే, సవాలక్ష కారణాలు. బులుగు రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ ‘ఫిష్ ఆంధ్ర’ దుకాణాల నిర్వహణలో ఉంటే బాగుండేది. ఓబులదేవచెరువులో క్లోజ్ అయిన ఫిష్ ఆంధ్ర ముందు ఈ సెల్ఫీ దిగాను. గతంలో చిత్తూరు జిల్లాలో ‘ఫిష్ ఆంధ్ర’ మూతపై ఓ సెల్ఫీతో ప్రశ్నించాను. మౌనం అర్దాంగీకారం అనుకోవచ్చా?. ఫిష్ ఆంధ్ర శాశ్వతంగా ఫినిష్ అయినట్టేనా?’ అని లోకేశ్(Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Read Also: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దుర్మార్గం: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Follow us on: Youtube Instagram