అరకు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం ముసరుగుడ గ్రామంలో పార్టీ కార్యకర్త బసు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన బసు చిత్రపటానికి నివాళులర్పించి మూడు లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని కుటుంబసభ్యులకు అందజేసారు భువనేశ్వరి. అరకులో గిరిజనులు సాగు చేస్తున్న కాఫీని రుచి చూశారు. దీని పై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. అరకు గోల్డ్ కాఫీ వద్ద కాఫీ తాగుతున్న భువనేశ్వరి ఫొటోను పోస్టు చేశారు. భువనేశ్వరీ.. మన గిరిజన సోదర సోదరీమణులు ఉత్పత్తి చేస్తున్న కాఫీ ఎలా ఉంది? అని సరదాగా ప్రశ్నించారు.