మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. వెలగపూడలో మహిళ మరియమ్మ హత్య కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. కస్టడీ ముగిశాక ఆయన్ను పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. నవంబర్ 4 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. అనంతరం సురేశ్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నందిగం సురేశ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి సెంట్రల్ జైలులో ఉన్న నందిగం సురేశ్‌కి ఆ కేసులో బెయిల్ వచ్చింది. అయితే మరియమ్మ హత్య కేసులో పీటీ వారెంట్ పై నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి మరోసారి సెంట్రల్ జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదీగా గుంటూరు సెంట్రల్ జైల్లో ఉన్న నందిగం సురేష్ ను విచారణ చేసి వివరాలు తెలుసుకోవడానికి తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పోలీసుల అనుమతితో రెండు రోజుల పాటు నందిగం సురేశ్‌ను పోలీసులు విచారించారు.