Kiran Kumar Reddy |ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న నల్లారి.. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ, జాతీయ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌గా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. నల్లారి(Kiran Kumar Reddy)కి బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నుండి తొలిగిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా యాక్టివ్‌గా లేరు. ఇకనుండి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఇప్పుడు ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Read Also: BRS మీటింగ్ లో 15 మంది MLAలకు కేసీఆర్ జలక్
Follow us on: Youtube Instagram