భారతదేశంలోనే అతిపెద్ద పెద్దపులుల అభయ అరణ్యం నాగార్జునసాగర్ -శ్రీశైలం టైగర్ రిజర్వ్. ప్రకృతి సిద్ధంగా ఇక్కడి నల్లమల్లలో పెద్ద పులులు సంతాన ఉత్పత్తి చేస్తూ వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలో ఆత్మకూరు వన్యప్రాణి అటవీ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు రేంజ్ ముసలి మడుగు బీట్ పరిధిలో ఓ పులి చిక్కు కుంది. ఉచ్చును తెంచుకొని నల్లమల్లలో సంచరిస్తున్న పులిని కెమెరాలో గుర్తించిన అధికారులు రంగంలోకి దిగి రహస్యంగా రెస్క్యూ ఆపరేషన్ చేసి గాయాల పాలైన పెద్దపులిని రక్షించారు. ఈ సంఘటన ఎన్ టి సి ఏ చరిత్రలోనే అరుదైనదిగా రికార్డుకెక్కింది. ఆత్మకూరు అటవీ అధికారులకు కేంద్రం నుంచి ప్రశంసలు అందాయి.
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ ఆత్మకూర్ రేంజ్ ముసలిమడుగు బీట్ లో T123 F ఆడ పెద్దపులి వేటగాళ్ల ఉచ్చుకు చిక్కుకుంది. రెండు రోజుల తర్వాత ఉచ్చును తెంచుకుని అదే బీట్‌లో ఉత్తర, తూర్పు నల్లమల వైపు సంచరించింది. దీన్ని గమనాన్ని అటవీశాఖ ట్రాప్ కెమెరాలు బంధిం చాయి. వెంటనే ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ 50 మంది సిబ్బందితో రంగంలోకి దిగారు. 24 గంటలు పులి స్థావరాన్ని మారుస్తూ అటవీ సిబ్బందిని ముప్పు తిప్పలు పెట్టింది. నేషనల్ టైగర్ కన్జర్వే షన్ అథారిటీ ఆదేశాలతో ఐదుగురు మహారాష్ట్రకు చెందిన పెద్దపులుల రెస్క్యూ ఆపరేషన్ నిపుణులు రంగప్రవేశం చేశారు. పులి సంచరించిన బాట, అడుగు జాడలసు బట్టి స్థావరాన్ని పసిగట్టారు. ట్యాంకు లైజర్ గన్‌తో మత్తుమందు ఇచ్చి బంధించారు. గాయపడ్డ T123 ఎఫ్ ఆడ పులి గాయాలకు చికిత్స చేసి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు. ఆత్మకూరు అటవీ అధికారులను NTCA అభినందిం చింది. కాగా.. గత ఏడాది ఇదే రోజు ముసలిమడుగు పక్కనే ఉన్న పెద్ద గుమ్మడాపురం ఆడపులి నాలుగు కూనలను విడిచి అదృష్టమైంది. ఇంతవరకు అదృష్టమైన T108F తల్లి పులి ఆచూకీ తెలియలేదు.


