టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున అభిమానుల సుధీర్ఘ నిరీక్షణకు చెక్ పడింది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘నా సామిరంగ’ అంటూ రాబోతున్న కొత్త సినిమా టీజర్ కూడా వచ్చేసింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన విజయ్ బన్నీతో నాగ్ తన కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ మేరకు ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు ఓ మాస్ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన్మధుడిగా పేరున్న నాగార్జునను ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి దింపేశాడు దర్శకుడు బిన్నీ. కథను పెద్దగా రివీల్ చేయలేదు కానీ సినిమా మాత్రం ఓ రేంజ్‌లో ఉండబోతుందని టీజర్‌తో ఓ క్లారిటీ ఇచ్చేశాడు.
పులులంటూ విర్రవీగే రౌడీలకు అసలు పులి వేట ఎలా ఉంటుందో నాగ్ చూపించబోతున్నట్లు టీజర్‌తో చిన్న పాటి విధ్వంసమే సృష్టించాడు. ‘మాస్’ సినిమాను మించిన మాస్ కంటెంట్‌తో నాగార్జునను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ బిన్నీ. విజువల్స్ రా, రస్టిక్‌గా అనిపిస్తున్నాయి. ఇన్నాళ్ల అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఈ టీజర్ సరైనా సమాధానంలా కనిపిస్తోంది. ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాతో విలన్‌గా పరిచయం కాబోతున్నారు. ‘పలాస’తో దర్శకుడిగా ఓ రేంజ్‌లో విలనిజం పండించిన కరుణ కుమార్.. ఇప్పుడు నటుడిగా.. నాగార్జునను ఎదుర్కొనే విలన్‌గా విలనిజాన్ని ఏ రేంజ్‌లో పండిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.


