హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన పుల్ల నాగరాజు అనే యువకుడికి ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ఆ యువకుడి కుటుంబానికి తీన్మార్ మల్లన్న టీం, సోషల్ మీడియా ఇన్‌ఛార్జి కొలుగూరి ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన ఫోన్‌లో పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయంను తన టీం సభ్యుల ద్వారా అందజేశారు. ఆపదలో ఉన్న వారికి తీన్మార్ మల్లన్న ఆపన్న హస్తం అందజేయడం ఎంతో స్ఫూర్తిదాయకం అని అన్నారు. తనకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ధన్యవాదాలు తెలిపారు.