మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. బీపీ కూడా సాధారణ స్థితికి వచ్చిందని వైద్యులు తెలిపారు. కాగా గత మూడు రోజులుగా మైత్రీ మూవీస్ సంస్థకి చెందిన ఆఫీసుతో పాటు నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నవీన్ ఇంట్లో సోదాలు జరుగుతుండగానే ఆయనకు బీపీ పెరిగి అస్వస్థతకు గురయ్యారు.