25.2 C
Hyderabad
Tuesday, October 3, 2023
spot_img

అక్కను చంపింది చెల్లెలే.. ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి మరీ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ లో సంచలనం సృష్టించిన సాఫ్ట్ వేర్  యువతి దీప్తి డెత్ మిస్టరీ వీడింది. చెల్లి చందన స్నేహితుడితో కలిసి దీప్తిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్లేటప్పుడు దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, చున్నీ చుట్టి వెళ్లిపోయినట్టు చందన ఒప్పుకుంది. బాయ్ ఫ్రెండ్, అతని తల్లి, మరో బంధువు, కారు డ్రైవర్ తో కలిసి చందనే మర్డర్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న చందన సీనియర్ తో ప్రేమలో పడింది.  మతాంతర వివాహానికి తల్లిందండ్రులు,అక్కడ  దీప్తి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులు లేని సమయంలో అక్క దీప్తితో మందు పార్టీ చేసుకున్నారు. తర్వాత అక్క దీప్తితో చందన గొడపడింది. ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపేసి వెళ్లిపోయింది. దీంతోనే దీప్తి ఊపిరాడక చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.  పోలీసులు విచారణ కొనసాగుతోంది. సాయంత్రం పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది.  సాయంత్రం నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

దీప్తి చనిపోయిన రోజే చెల్లులు పరార్
భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి, చందన, సాయి ముగ్గురు సంతానం. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తుంది. చందన బీటెక్‌ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటోంది. కుమారుడు సాయి బెంగళూరులో ఉంటున్నాడు. బంధువుల ఇంట్లో గృహప్రవేశం ఉండటంతో ఆదివారం(ఆగస్టు 27) శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం(ఆగస్టు 28) రాత్రి 10 గంటలకు వారిద్దరూ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం(ఆగస్టు 29) మధ్యాహ్నం ఫోన్‌ చేయగా దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. చందన ఫోన్‌ స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే ఇంటి ముందున్న వారికి శ్రీనివాస్ రెడ్డి సమాచారం ఇచ్చాడు. దీంతో వారొచ్చి చూడగా… దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ప్రవీణ్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉండగా, వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్‌ బాటిల్‌, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి. చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడు కలిసి ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్‌ బస్సులు ఆగేచోట కూర్చుని, కొద్దిసేపటికి నిజామాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీప్తి చెల్లి చందన, ఆమె ప్రియుడిని, వారికి సహకరించిన మరో వ్యక్తిని ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులు అరెస్ట్ చేశారు.

Latest Articles

టీడీపీలో ఉత్కంఠ.. రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్న నారా లోకేశ్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ యువనేత నారా లోకేశ్ రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. సీఆర్పీసీ 41ఏ కింద సెప్టెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్