స్వతంత్ర వెబ్ డెస్క్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కాంప్రమైజ్ అయ్యారు. టీఎస్‌ఆర్టీసీ కొత్త చైర్మన్ పదవి తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే.. నేడు టీఎస్‌ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు టీఎస్‌ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.
అలాగే తెలంగాణ రైతుబంధు చైర్మన్ గా వల్ల రాజేశ్వర్ రెడ్డి పదవిని తాటికొండ రాజయ్యకు ఇచ్చారు. అటు ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ గా నందికంటి శ్రీధర్ ను నియామకం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో గెలవాలని నేపథ్యంలోనే శ్రీధర్ కు ఈ పదవిని ఇచ్చారు. అటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉప్పల వెంకటేశులను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.