రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఓడించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ కుమారుడు జీవీ సుందర్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రజలను వంచించిందని మండిపడ్డారు. వర్గీకరణను అడ్డుపెట్టుకుని డీఎస్సీని నిలిపివేశారన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ బృతి ఎగొట్టారని, మత్స్యకారులను కూడా కూటమి మోసం చేస్తోందని విమర్శించారు.