సంగీతం తన పూర్వజన్మ సుకృత ఫలం అని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి అన్నారు. తనకు ఎన్నో గొప్ప సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశం వచ్చిందన్నారు. గండిపేటలోని తన నివాసంలో ఆయన ప్రముఖ ప్రవచనకర్త, తన గురువు దైవజ్ఞ శర్మతో కలిసి యూకే హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పియానోయిస్ట్ అవార్డును టీఎస్ సతీష్‌కు ప్రధానం చేశారు. పియానో వాయించడం అంత సులువైన విషయం కాదన్నారు. తన తండ్రి పియానో అద్భుతంగా వాయించేవారని, తనకు కూడా అలాంటి అదృష్టం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి పాటను తాను చిత్తశుద్ధితో కంపోజ్ చేస్తున్నట్లు వివరించారు. తన తండ్రి వాయించిన పియానోకు 100 ఏళ్ళు దాటిందన్నారు. తన సోదరుడు కూడా వాయించే వారని వివరించారు. అనంతరం టీఎస్ సతీష్ పియానో అద్భుతంగా ప్లే చేశారు.