స్వతంత్ర, వెబ్ డెస్క్: ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు. సడన్ గా గుండెపోటు రావడంతో హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గతంలో కుసుమ జగదీష్ మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికయ్యారు. జగదీష్ అకాల మరణపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగదీష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భార్య పిల్లలకి కుటుంబానికి అండగా ఉంటారని మంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.
ములుగు జిల్లా మల్లంపల్లిలోని కుసుమ జగదీష్ నివాసానికి చేరుకుని వారి పార్థివదేహానికి మంత్రి సత్యవతి రాథోడ్ పుష్పాంజలి ఘటించారు. మృతదేహాం వద్ద మంత్రి సత్యవతి రాథోడ్ కన్నీటి పర్యంతం అయ్యారు. జగదీష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. మంత్రి కేటీఆర్ ఉదయం 9 గంటలకు జగదీష్ పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొంటారని మంత్రి దయాకర్ రావు తెలిపారు.


