22.2 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

MS Dhoni: రిటైర్మెంట్‌ పై హింట్‌ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ.

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇటీవలే మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఐపీఎల్(IPL) ఆడటం కష్టమే అని భావించారు. అయితే తాజాగా బెంగళూరు(Bangalore)లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ధోనీ 2024 ఐపీఎల్ ఆడటంలో హింట్ ఇచ్చేసాడు.

భారత జట్టు మాజీ కెప్టెన్ మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) తన కెప్టెన్సీలో అనేక సిరీస్‌లు, ట్రోఫీలను గెలుచుకున్నాడు. ఎంఎస్‌ ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌(IPL) మ్యాచ్‌లే దీనికి నిదర్శనం. ఐపీఎల్‌ 2023లో అభిమానులు ధోనీ కోసం హంగామా చేశారు. ధోనీకి ఇది చివరి ఐపీఎల్‌ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది తర్వాత ధోనీ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పకున్నా 2024 ఐపీఎల్ ఆడతాడా లేదా అనుమానం అభిమానుల్లో నెలకొంది. దీనికి తోడు ఇటీవలే మాహీ మోకాలికి శస్త్ర చికిత్స(Knee surgery) చేయించుకోవడంతో ఐపీఎల్ ఆడటం కష్టమే అని భావించారు. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ధోనీ 2024 ఐపీఎల్ ఆడటంలో హింట్ ఇచ్చేసాడు.

ఒక ఈవెంట్‌లో భాగంగా ఇంటర్వ్యూలో ధోనీ రిటైర్మెంట్‌(Dhoni retirement) అవుతున్నారా అని హోస్ట్ అడగగా.. ఎంఎస్‌ ధోనీ(MS Dhoni) అతనిని ఆపేసి అంతర్జాతీయ క్రికెట్(International cricket) నుంచి మాత్రమే రిటైర్‌(retire) అవుతున్నట్లు చెప్పాడు. ఈ సమయంలో ప్రేక్షకులందరూ కూడా బిగ్గరగా నవ్వడం ప్రారంభించారు. ఐపీఎల్‌ 2024లో కూడా ఆడటానికి సిద్ధంగా ఉన్నానని ధోనీ పెద్ద హింట్‌ (Hint) ఇచ్చారు. ఆ ఈవెంట్‌లో ధోనీ చిరునవ్వుతో ప్రేక్షకుల వైపు సంకేతాలు ఇచ్చి ఐపీఎల్ 2024కి నేను రెడీ అని అభిమానులకు చెప్పకనే చెప్పాడు.

ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్‌కే(CSK) 2023 టైటిల్‌ను గెలుచుకుంది. ఇది ఆయన కెప్టెన్సీ ఐదో టైటిల్ కావడం గమనార్హం. దీని తర్వాత ధోని వచ్చే ఐపీఎల్ సీజన్‌లోపు ఐపీఎల్ నుండి రిటైర్ అవుతాడని నిరంతరం ఊహాగానాలు వచ్చాయి. ధోనీ ఆ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ, 2007లో భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, ఆ తర్వాత భారత జట్టును ముందుకు తీసుకెళ్లిన తీరుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఎంఎస్‌ ధోనీ(MS Dhoni) మోకాలి గాయం శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆయన ఫాస్ట్ గా కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు. దీంతో అభిమానుల కోసం ధోనీ ఐపీఎల్ 2024 ఆడటం దాదాపుగా ఖాయమైంది. మరి ఆ తర్వాత ధోనీ(Dhoni) ఆలోచనలు ఎలా ఉంటాయో చూడాలి. మొత్తానికి అభిమానులకు శుభవార్తచెప్పిన ధోనీ 2024 ఐపీఎల్ లో మరోసారి చెన్నైను విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.

ఇంతకంటే ఏమీ చెప్పలేను

అందరూ బాగా ఆడుతున్నారు. ఇంతకంటే ఏమీ చెప్పలేను.. అంటూ టీమిండియా(Team India) ప్రదర్శనపై ధోనీ కామెంట్స్ చేశాడు. ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 (World Cup 2023) టోర్నీలో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, టాప్‌లో నిలిచింది భారత జట్టు. మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండింట్లో గెలిచినా టీమిండియా(Team India) సెమీస్ చేరుతుంది… 2011 వన్డే వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టైటల్ గెలిచిన భారత జట్టు, 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచ కప్ ఆడుతోంది..‘భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది. చాలా చక్కని బ్యాలెన్సింగ్ కనిపిస్తోంది. అందరూ బాగా ఆడుతున్నారు. అంతా బాగా కనిపిస్తోంది. ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను.. మిగిలినవన్నీ సిగ్నల్‌తో అర్థం చేసుకోండి..’ అంటూ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు.

ఈసారి భారత జట్టు, వన్డే వరల్డ్ కప్(World Cup) గెలుస్తుందని ధోనీ కూడా ధీమాగా ఉన్నాడు. అయితే ఇంతకుముందు 2021, 2022 టీ20 వరల్డ్ కప్స్‌లో ధోనీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే భారత జట్టు టైటిల్ గెలవలేకపోవడంతో ఈసారి కామెంట్లు చేయకూడదని డిసైడ్ అయ్యాడు మాహీ.. 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. రనౌట్‌తో అంతర్జాతీయ కెరీర్‌ని మొదలెట్టిన మహీ, ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ రనౌట్(Run Out) అయ్యాడు..‘విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఓడిపోతే, ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. సెమీ ఫైనల్‌(Semi Final)లో ఓడిపోతే అస్సలు తట్టుకోలేం. ప్రతీ మ్యాచ్‌కి నా ప్లాన్స్‌ని సిద్ధంగా పెట్టుకుంటాను. నేను ఇండియాకి ఆడిన ఆఖరి మ్యాచ్ అదే..ఆ తర్వాత సంవత్సరానికి రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్ చేసినా, సెమీ ఫైనల్‌లో ఓడినప్పుడే అదే నా ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అని నాకు తెలుసు.. ’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. 

Latest Articles

‘కిల్లర్’ నుంచి హీరో పూర్వాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్