స్వతంత్ర, వెబ్ డెస్క్: నూతన పార్లమెంట్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశంశల జల్లు కురిపించారు. ఈరోజు ప్రధాని చేత ప్రారంభించబడిన కొత్త పార్లమెంట్ దేశ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తోందన్నారు. భారతీయత ఉట్టి పడేలా పార్లమెంట్ నిర్మాణం ఉందని వ్యాఖ్యానించారు. 2014 తరవాత భారత సంస్కృతిని పెంపొందించేలా మోడీ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సెంగోల్ రాజదండం పార్లమెంట్‌లో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని వ్యాఖ్యానించారు.
“కేసీఅర్, నీతి అయోగ్ సమావేశానికి, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు. ప్రధానిని, గవర్నర్లను అవమాన పరిచేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కు అడుగులకు మడుగులు ఒత్తెలా కేసీఅర్ వ్యవహరిస్తున్నారు. మోడి కి పెరుగుతున్న ఆదరణ ను చూసి ప్రతిపక్షాలు సహించ లేకపోతున్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పోటీ చేస్తే వీళ్లంతా వ్యతిరేకించారు. మోడీని విమర్శించేందుకు ఒక్కటి అవుతున్నారు. వీళ్ళందరికీ మోడి జ్వరం పట్టుకుంది. ఆర్జేడీ స్థాయి మర్చి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్య దేవాలయాన్ని అలా పోల్చడం సరైంది కాదు. కేసీఅర్, కేజ్రివాల్ లు చెట్టా పట్టాల వెనుక.. లిక్కర్ కేసు ఉంది. నదులకు నడక నేర్పాడో లేదో కానీ మద్యానికి పరుగులు నేర్పారు కేసీఅర్.” – ఎంపీ లక్ష్మణ్