స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) నేడు సీబీఐ కోర్టు ముందుకు హాజరయ్యారు. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇక ఈ కేసులోనే శివశంకర్ బెయిల్ పై కూడా కోర్టు విచారణ జరపనుంది. ఇవాళ ఒక్కరోజే వివేకా మర్డర్ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
కాగా వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ వదలడం లేదు. ఈ కేసులో ఇప్పటికే అనేకసార్లు అవినాష్ రెడ్డి (Avinash Reddy)ని విచారించిన సీబీఐ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది. ఇక తాజాగా అవినాష్ రెడ్డికి సీబీఐ (CBI) మరోసారి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టులో హాజరుకావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఈ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ అందులో అవినాష్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల పేర్లను పేర్కొంది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని కోర్టు ముందుకు రావాలని సీబీఐ (CBI) ఆదేశించింది. దీనితో ఆయన నేడు సీబీఐ కోర్టు ముందు హాజరయ్యారు.