CORONA IN INDIA | దేశంలో గతకొన్ని రోజుగా శాంతించిన కరోనా… మళ్లీ విజృంభించేందుకు సిద్ధం అయింది. ఇందుకు నిదర్శనం రోజురోజుకు పెరుగుతున్న కేసులే. దాదాపు ఆరు నెలల తర్వాత మరోసారి 3 వేల మందికి వైరస్ సోకడంతో భయాందోళనలో పడ్డారు దేశ ప్రజలు. ఫస్ట్ వేవ్పె, సెకండ్ వేవ్ లోనే అల్లకల్లోలం సృష్టించిన ఈ వైరస్.. ఇక థర్డ్ వేవ్ లో ఎలా తన ప్రతాపాన్ని చూపిస్తుందోనని ఖంగారు పడుతున్నారు. ఈ మధ్య రోజు రోజుకు కరోనా కేసులో మూడు వేలకు పైగానే నమోదవుతున్నాయి. దీనికి గల కారణం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 రూపాంతరమేనని అంచనా వేస్తున్నారు ఆరోగ్య నిపుణులు;. ఇప్పటికే పలు అధ్యయనాలు వేరియంట్ ఇన్ఫెక్టివిటీ రేటును చూపుతున్నాయని తెలుపుతున్నాయి
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎపిడెమియోలాజికల్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం… గత 28 రోజుల్లో భారతదేశంలో కోవిడ్ -19తో మృతి చెందిన వారి సంఖ్య 114 శాతానికిపైగా పెరిగింది. అదే సమయంలో కొవిడ్ కేసుల సంఖ్య 437 శాతం పెరిగింది. అయితే ఈ కేసుల పెరుగుదలకు, మృతులకు సంభందించి ఇంకా కారణాలు తెలియరాలేదు. ఆగ్నేయాసియా ప్రాంతం నుంచి 27వేల కంటే ఎక్కువగా కొత్త కేసులునమోదవ్వగా… భారత్ తర్వాత మాల్దీవుల్లో 129శాతం, నేపాల్‌లో 89శాతం కేసులు పెరిగినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.