తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో మహిళలకు నిధులు కేటాయించలేదని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించింది. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతి మహిళకు 2500 రూపయలు, ప్రతినెలా 4 వేల రూపాయల పెన్షన్, అమ్మాయిలకు స్కూటీ ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని మహిళామోర్చ నేతలు దుయ్యబట్టారు.


