స్వతంత్ర వెబ్ డెస్క్: కోకాపేట నియో పోలిస్ భూములు అమ్ముడుపోయిన మాదిరిగానే.. మోకిల్లా ప్లాట్లు కూడా వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐటీ కారిడార్‌కు సమీపంలోని మోకిల్లాలో మొదటి దశలో 50 ప్లాట్లను హెచ్ఎండీఏ సోమవారం వేలం వేసింది. ఈ ప్లాట్ల విక్రయంతో ప్రభుత్వానికి రూ. 121.40 కోట్ల ఆదాయం వచ్చింది. 50 ప్లాట్ల వేలంతో రూ. 40 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ప్రభుత్వ అంచనాకు మూడు రెట్లు అధికంగా ఆదాయం సమకూరింది. మోకిల్లాలో చదరపు గజం ధర గరిష్ఠంగా రూ. 1.05 లక్షలు పలికింది. చదరపు గజం ధర కనిష్ఠంగా రూ. 72 వేలు పలికింది. సగటున రూ. 80,397 పలికింది.