14.7 C
Hyderabad
Sunday, January 18, 2026
spot_img

మన్ కీ బాత్ లో పరీక్షల టెన్షన్ కు మోదీ చిట్కా

    మన్ కీ బాత్ కార్యక్రమం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌. పదేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాదు మన్‌కీ బాత్  సూపర్ డూపర్‌గా హిట్ అయింది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా యావత్ భారత దేశంలోని ప్రతి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరయ్యారు. రొటీన్ రాజకీ యాలను పక్కనపెట్టి అనేక వర్తమాన అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలతో మనస్సు విప్పి మాట్లాడటానికి ఇదొక వేదిక అయింది. పరీక్షల సందర్బం గా చిన్నారులు పడే టెన్షన్ సహా అనేక అంశాలను ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అంతేకాదు మహిళలకు సంబంధించిన అంశాలకు పెద్ద పీట వేశారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రజలు రేడియో మరచిపోయి చాలా కాలమైంది. టీవీలు రావడంతో రేడియోలను జనం అటకెక్కిం చారు. అయితే మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ప్రతినెలా చివరి ఆదివారం ఉదయం పదకొండు గంటలు కాగానే అందరికీ ఠక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తుకు వస్తుంటుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే మాటలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. సహజంగా ప్రధాని స్థాయి వ్యక్తులు బహిరంగ సభల్లో చేసే ప్రసంగాలు ఒక తరహాలో ఉంటాయి. ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు ప్రతిపక్షాలపై సైద్ధాంతిక దాడి ఈ ఉపన్యాసాల్లో తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే మన్ కీ బాత్ దీనికి పూర్తి విరుద్ధం. అనేక వర్తమాన అంశాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. ఈ మనసులో భావాలు రకరకాలుగా ఉంటాయి. ఎన్నికలు, రాజకీయాలకు ఇవి దూరంగా ఉంటాయి. పరీక్షల టెన్షన్‌ నుంచి పిల్లలు బయపడటం వంటి ఆసక్తికరమైన అంశాల గురించి కూడా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతుంటారు. చిన్నారులకు అనేక విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఒక్కోసారి ఒక్కో ఆసక్తికరమైన అంశం తీసుకుంటారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ తన మనసు లోని భావాలను ప్రజలతో షేర్ చేసుకుంటారు.

మన్‌ కీ బాత్ ఓ వినూత్న కార్యక్రమం. ఇప్పటివరకు మన దేశ ప్రధానులెవరూ ఇటువంటి విభిన్నమైన కార్యక్రమాన్ని చేపట్టలేదు. వాస్తవానికి మన్ కీ బాత్ ఒక పార్టీ కార్యక్రమం కాదు. ఒక రాజకీయపరమైన కార్యక్రమం అంతకంటే కాదు. సమాజంలో సంభవిస్తున్న మార్పులు, వాటి మంచీ చెడూలను ప్రజలకు వివరించే కార్యక్రమమే మన్ కీ బాత్‌. ప్రజలకు సేవ చేసేవారిని ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తుంటారు ప్రధాని నరేంద్ర మోడీ.ఒక్కోసారి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలకు పరిచయం చేస్తుంటారు. మరోసారి ప్రజలకు ఎలా సేవ చేయవచ్చో వివరిస్తుంటారు ప్రధాని నరేంద్ర మోడీ. తాజాగా నూట పదకొండో ఎపిసోడ్‌ కూడా పూర్తయ్యింది.

మన్‌ కీ బాత్‌ నూట పదకొండు ఎపిసోడ్లు పూర్తయింది. అయినప్పటికీ ప్రతి ఎపిసోడ్ భిన్నంగానే ఉంటుంది. ఒక ఎపిసోడ్‌కు మరో ఎపిసోడ్‌కు ఎక్కడా పోలికే ఉండదు. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో అంశంపై మనసు విప్పుతారు ప్రధాని నరేంద్ర మోడీ. మన్‌కీ బాత్ కార్యక్రమానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దేశ ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది ఈ వినూత్న కార్యక్రమం. పార్టీలకతీతంగా, ప్రాంతాల కతీతంగా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అక్కున చేర్చుకున్నారు దేశ ప్రజలు.మన్ కీ బాత్ ఓ ఎపిపోడ్‌ను పూర్తిగా విద్యార్థులకు కేటాయించారు నరేంద్ర మోడీ. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి గురించి ప్రస్తావించారు. ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు ఎలా రాయాలో అందరికీ అర్థమ య్యే భాషలో చిన్నారులకు వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ నెలలో జరిగిన అంశాలు, వివిధ రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలను ప్రధాని మోడీ ప్రజలతో పంచుకుంటా రు. ఈ కార్యక్రమా న్ని ప్రతినెల 23 జాతీయ భాషలు అలాగే ఇంగ్లీష్ సహా 11 అంతర్జాతీయ భాషల్లోనూ ప్రసారం చేస్తారు. అంతేకాదు మన్ కీ బాత్ కమర్షియల్ గానూ విజయవంతమైంది. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రసార భారతికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ మానస పుత్రిక అయిన మన్ కీ బాత్ కార్యక్రమం దేశంలోనే కాదు. విదేశాల్లోనూ పాపులర్ అయంది. బిల్‌ గేట్స్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. మన్ కీ బాత్  ఓ సామాజిక విప్లవం అంటారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వానికి, ప్రజలకు ఓ వారధిలా మన్ కీ బాత్ పనిచేసింద న్నారు కిషన్ రెడ్డి. సామాన్యుడి మేలు కోసం ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి ఒక వేదికలా మన్ కీ బాత్ ఉపయోగపడుతోందని కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయ నాయకులే కాదు సామాన్య ప్రజలు కూడా మన్ కీ బాత్‌ కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా అనేక కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ తమతో ఆయన ఆలోచనలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు సామన్య జనం. ఏదిఏమైనా మన్ కీ బాత్…ఓ సూపర్ హిట్ ప్రోగ్రాం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్