ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారులతో భేటీ అయ్యారు. పతకాలు సాధించిన వారిని సత్కరించారు. వారందరినీ అభినందించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ క్రీడాకారులతో కాసేపు ముచ్చటించారు. 21 ఏళ్ల వయసులోనే రెజ్లర్ అమన్.. ఒలింపిక్ పతకం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. వినేష్ ఫోగట్ ఫైనల్‌కు వెళ్లి చరిత్ర సృష్టించిందని అన్నారు. క్రీడారంగంలో భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందన్నారు. 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పారిస్ ఒలింపిక్స్‌తో భారత క్రీడారంగంలో మార్పులు వస్తాయని.. బడ్జెట్‌లో క్రీడారంగానికి ఏటా నిధులు పెంచుతామని మోదీ చెప్పారు.