కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి రాబోతున్నారని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన మండి పడ్డారు. అందుకే ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం పోరాడుతానని నమ్మి ప్రజలు తనను గెలిపించారన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసు కొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు.


