ఢిల్లీకి చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం జరుగనుంది . ఈ సమావేశంలో లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ తనకు ఇచ్చిన నోటీసులపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ రేపు జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నా చేయనున్నారు. 11న ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరుకానున్నారు.