భారత్ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఇవాళ ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద తలపెట్టనున్న దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. దీక్షకు సాంకేతిక కారణాలతో పర్మిషన్ రద్దు చేస్తున్నట్లు పోలీసులు కవితకు సమాచారం అందించారు. దీంతో జాగృతి ప్రతినిధులు పోలీసులతో సంప్రదింపులు జరుపగా అనంతరం దీక్షకు అనుమతిచ్చారు.
దీంతో నేడు యధావిధిగా జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష జరగనుంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో దాదాపు 6 వేల మంది దీక్షలో కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు దీక్షలో పాల్గొనేందుకు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్ సహా బీఆర్‌ఎస్ మహిళా ప్రతినిధులు ఢిల్లీకి చేరున్నారు.
Read Also: తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా
Follow us on: Youtube Instagram