Yuvagalam |’యువగళం’ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద 500 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది. ఈ సందర్భంగా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ… టీడీపీ అధికారంలోకి వచ్చాక మదనపల్లి నియోజకవర్గంలో టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్ యూనిట్, కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార వైసీపీపై విరుచుకుపడుతూ.. రాష్ట్రంలోని ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పడాలని అన్నారు. కాగా, చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న మొదలుకొని.. ఇప్పటివరకు 12 నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి అయింది.
Read Also: జనసేన పార్టీ ఆవిర్భావ సభ.. వారాహిలో వెళ్లనున్న పవన్!
Follow us on: Youtube Instagram