24.7 C
Hyderabad
Thursday, June 13, 2024
spot_img

రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు చుక్కెదురు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ, సీబీఐ అరెస్ట్‌లు ఊపిరిసలపనివ్వడం లేదు. కోర్టు ద్వారా ఉపశమనం పొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా చుక్కెదురే అవుతుంది తప్ప ఊరట లభించడం లేదు. మొన్న మధ్యంతర బెయిల్, తాజాగా సీబీఐ అరెస్ట్‌ పిటిషన్‌లపై ఆమెకు ఎదురుదెబ్బే తగిలింది. మరోవైపు కవితను మూడు రోజుల కస్టడీకి అనుమ తిస్తూ తీర్పునిచ్చింది రౌస్‌ అవెన్యూ కోర్టు. దీంతో కవిత ఇప్పట్లో బయటకు వస్తారా..? లిక్కర్‌ స్కాం ఉచ్చు నుంచి బయ టపడుతారా…? మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె బయటకు రాకుండా ఎక్కడికక్కడ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈడీ అరెస్ట్‌తో తీహార్‌ జైల్లో ఉన్న కవితను ఇప్పటికే సీబీఐ అరెస్ట్‌ చేసింది. అయితే,.. తనను విచారించడానికి 5 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేసింది సీబీఐ. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. అయితే,..సిబిఐ అరెస్ట్‌, విచారణను ఖండిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆమెకు కోర్టులో చుక్కెదురైంది. సిబిఐ తనను ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు, ఆమె అరెస్ట్‌ను సవాల్ చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

కోర్టు విచారణ సందర్భంగా తనను సిబీఐ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇప్పటికే సిబిఐ అధికారులు తనను ప్రశ్నించారని, అడిగిన ప్రశ్నలను మళ్లీమళ్లీ అడుగుతున్నారని కవిత కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే కవితను విచారించి మరిన్ని వివరాలను తెలుసుకోవలసిన అవసరం ఉందని, ఆమె విచారణకు సహకరించడం లేదని, సిబిఐ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కవిత లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి అని సీబీఐ తరుపున న్యాయవాదులు వాదిం చారు. ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత భాగస్వామి అని నిందితుల వాట్సాప్ చాట్ ద్వారా స్పష్టమయిందని వివరించ డంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సిబీఐ వాదనతో ఏకీభవించి కవితను మూడు రోజుల సిబిఐ కస్టడీకి అనుమ తించింది. దీంతో తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకొని లిక్కర్‌ స్కాం వెనుక ఎవరెవరు ఉన్నారు..? ఎవరి పాత్ర ఎంత అన్నదానిపై లోతుగా విచారించనుంది సీబీఐ.

    ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తోంది సీబీఐ. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లను సమీకరించి ఆ నిధులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అప్పగించారని అంటోంది సీబీఐ. కవిత సూచన మేరకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 25 కోట్ల రూపాయలు అందచేశారని, ఒకసారి పదిహేను కోట్లు, మరొక సారి పదికోట్లు అందచేశారని కోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డి తన వాంగ్మూలంలో పేర్కొన్నారని కూడా చెప్పింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత కుట్రదారు అని, విచారణకు సహకరించకపోవడం వల్లనే మరోసారి విచారించడానికి అనుమ తివ్వాలని సీబీఐ కోరింది. అయితే ఒకే కేసులో అరెస్టయి ఉన్న కవితను మరోసారి మరొక సంస్థ అరెస్ట్ చేయడం ఏంటని కవిత తరుపున న్యాయవాదులు ప్రశ్నించారు. కవితను రాజకీయ కారణాలతోనే ఇబ్బంది పెట్టేందుకు ఈ కేసులో ఇరికించారని వాదించారు లాయర్‌ విక్రమ్‌ చౌదరి. ఆమె ప్రైవసీకి భంగం కలిగించే ఆరోపణలు చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కవితకు ఈ కేసుతో ప్రమేయం లేదన్నారు. తాను లీగల్ అడ్వయిజర్‌ను కోరినా ఇవ్వలేదని, రాత్రి పదిన్నర గంటలకు అరెస్ట్ చేసినట్లు చూపించారని తెలిపారు కవిత. తనను ఇదే కేసులో మళ్లీ అరెస్ట్ చేయడం అన్యాయమని.. కక్ష సాధింపు ధోరణి ఇందులో కనపడుతుందని మండిపడ్డారు. తనకు ఈకేసులో ఎలాంటి ప్రమేయం లేకపోయినా రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని.. న్యాయం తనకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు.

ఇక కవితకు లిక్కర్‌ స్కాంలో ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కవిత అరెస్టుతో చోటుచేసుకున్న పరిణామాలు పార్టీ నుండి చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయేలా చేస్తున్నాయి. ఓటమి బాధతోపాటు గులాబీ శిబిరం ఖాళీ అవుతున్న బాధలో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేతకు కవిత అరెస్ట్‌ వ్యవహారంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మింగుడుపడటం లేదు. మరోపక్క లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే కవిత విషయంలో జరుగుతున్న పరిణామాలు గులాబీ నేతలను అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోవైపు ఈడి అరెస్టు చేసిన కవితను, మళ్ళీ సీబీఐ అధికా రులు అరెస్టు చేయడం అన్ని వైపుల నుండి కవితను ఇరకాటంలో పెడుతుండడంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉంది బీఆర్ఎస్‌ పరిస్థితి. ఇక సీబీఐ మూడు రోజుల కస్టడీలో ఎలాంటి నిజాలు బయటకు రానున్నాయి…?ఇకనైనా సీబీఐకి కవిత సహకరిస్తారా..? లిక్కర్‌ స్కాం నుంచి కవిత బయటపడుతారా..? కుంభకోణం కూపీలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నది ప్రస్తుత రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Latest Articles

‘పద్మవ్యూహంలో చక్రధారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

వీసీ క్రియేషన్స్ బ్యానర్ పై కే. ఓ. రామరాజు నిర్మాతగా, సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పద్మహ్యూహంలో చక్రధారి. ప్రవీణ్‌రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. మాస్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్