మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని అన్నారు. వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన మాట ప్రకారమే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు. తాము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తుందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటు పడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్లలో రైతు బంధు పేరుతో ఏడాదికి రూ.8వేల నుంచి రూ.10 వేలు ఇచ్చిందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎకరాకు రూ.500 బోనస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. రేషన్ కార్డుల జారీని గత ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. ఫార్మూలా కేసు రేసు నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడలను కేటీఆర్ చేస్తున్నారని ఆక్షేపించారు.